Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 03 Jul 2022 14:28:34 IST

Macharla Niyojakavargam లో తెలుగమ్మాయి ఐటెం సాంగ్..

twitter-iconwatsapp-iconfb-icon

యూత్‌స్టార్ నితిన్ (Nithin) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా మాచర్ల నియోజకవర్గం (Macharla Niyojakavargam ). ఈ మూవీలో తెలుగమ్మాయి అంజలి (Anjali) ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయబోతోంది. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి (MS Rajashekhar రెడ్డి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి- నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం మూవీని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

అయితే, ఈ సినిమాలో యూత్‌ను ఉర్రూతలూగించే ఓ మాస్ నంబర్ ఉండగా ఆ సాంగ్ కోసం హీరోయిన్ అంజలిని చిత్రబృందం తీసుకుంది. ఇందులో తన ఐటెం సాంగ్ ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ తాజాగా పోస్టర్‌ను విడుదల చేశారు. అంజలి ఒకవైపు మంచి పాత్రలు పోషిస్తూనే ఇలా అప్పుడప్పుడు ఐటం సాంగ్స్ కూడా చేస్తూ అలరిస్తోంది. గత ఏడాది వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా ఆర్సీ 15లో ఓ ముఖ్య పాత్రను చేస్తుంది.  

ఇక అమ్మడికి ఐటెం సాంగ్ చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో సూర్య నటించిన సింగం మూవీలో అలాగే, అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో ఐటెం సాంగ్స్ చేసి అలరించింది. ఇప్పుడు నితిన్ సరసన మాస్ స్టెప్స్‌తో సందడి చేయబోతుంది. మరి ఈ మాస్ సాంగ్ ఆడియన్స్‌ను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో క్యాథరిన్ (Catherine Tresa) కీలక పాత్రలో నటించింది. కాగా, ఇటీవల నితిన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. మరి మరోసారి మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న మాచర్ల నియోజకవర్గం నితిన్‌కి ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement