మహిళా సీఎం ఎవరో స్పష్టతివ్వండి: అనిత

ABN , First Publish Date - 2020-02-22T09:52:14+05:30 IST

‘‘ఎడారి గడ్డపై నిమ్మగడ్డకి, తా డేపల్లి అడ్డాలో ఉన్న జగన్‌కీ ఉన్న క్విడ్‌ ప్రోకో బంధం తెలిసిన పారిశ్రామిక వేత్తగా భవిష్యత్తును ఊహించి ఏపీకి మహిళా సీఎం రావాలనే మీ కోరిక సమంజసమైనదే.

మహిళా సీఎం ఎవరో స్పష్టతివ్వండి: అనిత

అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ‘‘ఎడారి గడ్డపై నిమ్మగడ్డకి, తా డేపల్లి అడ్డాలో ఉన్న జగన్‌కీ ఉన్న క్విడ్‌ ప్రోకో బంధం తెలిసిన పారిశ్రామిక వేత్తగా భవిష్యత్తును ఊహించి ఏపీకి మహిళా సీఎం రావాలనే మీ కోరిక సమంజసమైనదే. హాట్‌ ట్వీట్‌ చేసి డిలీట్‌ చేసినా, మీ మనసులో కోరిక బ యటపెట్టారు’’ అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్వీట్‌ చేశారు. ‘‘అభివృద్ధి వద్దు, సంక్షేమం రద్దు అంటున్న జగన్‌ మాకొద్దంటున్నా రు ప్రజలు. తాడేపల్లిలో భారతి, షర్మిల మధ్య కుర్చీపోరు తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఏ మహిళ సీఎం కావాలనుకుంటన్నారో మరో ట్వీట్‌లో క్లారిటీ ఇస్తారని ఆశిస్తున్నాం’’ అని పొట్లూరి వరప్రసాద్‌ని ఉద్దేశించి అనిత ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో భార్య పేరుతో అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించి వివాహ వ్యవస్థకే జగన్‌ కళంకం తెచ్చారని ఆరోపించారు.

Updated Date - 2020-02-22T09:52:14+05:30 IST