నిందితుడికి ఉరిశిక్షపడే వరకు పోరాటం

ABN , First Publish Date - 2021-03-02T06:08:47+05:30 IST

బీఎస్సీ విద్యార్థిని కోటా అనూషను హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష పడేవరకు పోరాటం చేద్దామని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

నిందితుడికి ఉరిశిక్షపడే వరకు పోరాటం
అనూషా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

 తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

 ముప్పాళ్లలో అనూష తల్లిదండ్రులకు పరామర్శ

  

ముప్పాళ్ళ, నరసరావుపేట టౌన్‌, మార్చి 1: బీఎస్సీ విద్యార్థిని కోటా అనూషను హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష పడేవరకు పోరాటం చేద్దామని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మండలంలోని గోళ్ళపాడులో ఆమె సోమవారం అనూష తల్లిదండ్రులను కలశారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై దాడులు పెరిగాయన్నారు. రాష్ట్ర హోం మంత్రి సొంత జిల్లా అయినప్పటికీ ఇంతవరకు పరామర్శించక పోవటం మహిళలపై వారికి ఉన్న నిబద్దత అర్థం అవుతుందన్నారు. నీ ఇంట్లో ఆడపిల్లకు ఇలాగే జరిగితే ఇంట్లో కూర్చుంటావా అని ప్రశ్నించారు. గన్‌ కన్నా ముందు జగన్‌ వస్తాడని చెప్పిన నాటి మహిళా నాయకులు ఇప్పుడు మాట్లాడడం లేదన్నారు. కనీసం పిట్టలదొర ఉపయోగించే గన్‌ కూడా రాలేదన్నారు.  పక్క రాష్ట్రంలో జరిగిన ప్రియాంకరెడ్డి గురించి మాట్లాడిన సీఎం ఇక్కడ ఆడపిల్లల మాన, ప్రాణాలు పోతుంటే స్పందించడం లేదన్నారు.  నిందితుడికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తే తెలుగుదేశం, తెలుగు మహిళ తరపున పోరాటం చేస్తామ హెచ్చరించారు. సమావేశంలో భీమినేని వందనాదేవి, న్యాయవాది ఉదయశ్రీ,  అన్నాబత్తిని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T06:08:47+05:30 IST