Adan Distilleriesకు 2019 నుంచి 2వేల కోట్ల పైబడి Turnover ఎలా సాధ్యమైంది?: Anita

ABN , First Publish Date - 2022-07-13T17:49:16+05:30 IST

అతి చిన్నదైన అదాన్ డిస్టలరీస్‌కు 2019 నుంచి 2వేల కోట్ల పైబడి టర్నోవర్ ఎలా సాధ్యమైందని...

Adan Distilleriesకు 2019 నుంచి 2వేల కోట్ల పైబడి Turnover ఎలా సాధ్యమైంది?: Anita

అమరావతి (Amaravathi): అతి చిన్నదైన అదాన్ డిస్టలరీస్‌ (Adan Distilleries)కు 2019 నుంచి 2వేల కోట్ల పైబడి టర్నోవర్ (Turnover) ఎలా సాధ్యమైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Anita) ప్రశ్నించారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 42 బ్రాండ్లు ఒక్క అదాన్ డిస్టలరీస్ పంపిణీ చేయటం వెనుక విజయసాయి (Vijayasai) ఇతర వైసీపీ (YCP) పెద్దలున్నారని ఆరోపించారు. 60 లక్షలకుపైగా మద్యం కేసులు ఈ కంపెనీ పంపిణీ చేస్తే దాదాపు రూ.1100 కోట్లు ప్రభుత్వం అదాన్ డిస్టలరీస్‌కు ఇప్పటి వరకు చెల్లించిందన్నారు. ఒక్క మద్యం ద్వారానే జగన్ రెడ్డి నెలకు రూ.500 కోట్లు పైబడి సంపాదిస్తున్నారని, అప్పులు తెచ్చేందుకు మహిళలు తాళిబొట్లు తెంపే ప్రభుత్వం జగన్ రెడ్డిదని విమర్శించారు. మద్యపాన నిషేధం అంటూ వైఎస్ ఫోటోతో ప్రచారం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వైఎస్ ఫోటో తొలగించి మద్య నియంత్రణ అంటూ మాట మార్చారన్నారు. జనాల రక్తం తాగి, సంక్షేమం పేరుతో బిస్కెట్లు వేస్తారా? అంటూ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో మద్యం ద్వారా రూ. 6,400 కోట్లు ఆదాయం వస్తే..., వైసీపీ ప్రభుత్వంలో రూ. 25 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ఆదాన్ డిస్టలరీస్‌కు తెలుగుదేశం ప్రభుత్వం అనుమతులిస్తే జగన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని వంగలపూడి అనిత ప్రశ్నించారు.

Updated Date - 2022-07-13T17:49:16+05:30 IST