Anita fire on Gorintla: ఎంపీ గోరంట్ల అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది: అనిత

ABN , First Publish Date - 2022-08-04T19:28:57+05:30 IST

ఏపీలో మహిళలకు రక్షణ లేదని తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

Anita fire on Gorintla: ఎంపీ గోరంట్ల అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది: అనిత

అమరావతి (Amaravathi): ఏపీ (AP)లో మహిళలకు రక్షణ లేదని తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Anita) అన్నారు. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) ఓ మహిళతో న్యూడ్ వీడియో (Nude Video) కాల్‌పై స్పందించిన ఆమె ఎబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajuothy)తో ఫోన్ ద్వారా మాట్లాడారు. గోరంట్ల మాధవ్‌ అరాచకాలకు అడ్డులేకుండా పోతోందన్నారు. అరాచకాలను ప్రశ్నించినవారిపైనే అక్రమ కేసులు పెట్టి...బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. వైకాపా పాలనలో మహిళలు బయటతిరిగే పరిస్థితి లేకుండా చేశారని, వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అనిత డిమాండ్ చేశారు.


ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల బాగోతం కలకలం రేపుతోంది. ఓ మహిళతో న్యూడ్‌గా మాట్లాడిన వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోరంట్ల వ్యవహార తీరు పట్ల నెటిజన్లే కాదు.. ఆయన నియోజక వర్గం ప్రజలు సయితం మండిపడుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మరిచి ఓ మహిళతో ఇలా ప్రవర్తించడాన్ని సొంత పార్టీ నేతలే ఎంపీ గోరంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-04T19:28:57+05:30 IST