అభివృద్ధి వికేంద్రీకరణ చంద్రబాబు అమలు చేశారు

ABN , First Publish Date - 2020-08-09T11:48:06+05:30 IST

అభివృద్ధి వికేంద్రీకరణ కొత్తదేమీక్టాఛీజూట సీఎంగా చంద్రబాబు హయంలో 13 జిల్లాల అబివృద్ధికి ప్రణాళికలు వేసి అమలు చేశారని టీడీపీ పుంగనూరు ..

అభివృద్ధి వికేంద్రీకరణ చంద్రబాబు అమలు చేశారు

పుంగనూరు, ఆగస్టు8: అభివృద్ధి వికేంద్రీకరణ కొత్తదేమీక్టాఛీజూట సీఎంగా చంద్రబాబు హయంలో 13 జిల్లాల అబివృద్ధికి ప్రణాళికలు వేసి అమలు చేశారని టీడీపీ పుంగనూరు ఇన్‌చార్జి ఎన్‌.అనీషారెడ్డి తెలియజేశారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అన్ని జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు దృష్టిసారించారని తెలిపారు. అందరికీ సమదూరంలో ఉంటుందని అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉండగా రాజధాని మార్పు ఉండదన్న జగన్‌ అధికారంలోకి రాగానే మాట మార్చారని విమర్శించారు. ప్రజాభిప్రాయానికి వెళ్లాలని చంద్రబాబు సవాల్‌ను స్వీకరించకుండా వైసీపీ ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2020-08-09T11:48:06+05:30 IST