Jul 26 2021 @ 00:19AM

RRR: అనిరుధ్‌ ప్రమోషనల్‌ సాంగ్‌ కోసమేనా?

అనిరుద్‌ ఆలియాభట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణ పూర్తి చేసుకుని ముంబై తిరుగు పయనం కావడం, అదే సమయానికి మరో సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌పై కీరవాణి ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ తెరకెక్కించినట్లు  తెలుస్తోంది. తమిళ ప్రమోషన్‌ సాంగ్‌ కోసం రాజమౌళి అనిరుధ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.  ఆదివారం కీరవాణి అది నిజమే అన్నట్లు ఓ ట్వీట్‌ చేశారు.  ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం అనిరుధ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. తన సమర్థత, శక్తి, టాలెంట్‌, అద్భుతమైన టీమ్‌ ముఖ్యంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అతని బలం’’ అని కీరవాణి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు అనిరుధ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.