సంక్రాంతి సందర్భంగా జరిగే జంతుబలి కార్యక్రమంలో మేకతలకు ఒక మనిషి తల నరకబడింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వలసపల్లి గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా వలసపల్లి గ్రామంలో జనవరి 16న సంక్రాంతి సందర్భంగా స్థానికింగా పూజింపబడే ఎల్లమ్మ తల్లి గుడి వద్ద జంతు బలి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చలపతి అనే వ్యక్తి జంతువులు ముఖ్యంగా మేకల తలను నరికే పని చేసేవాడు. కానీ ఆ రోజు చలపతి మద్యం సేవించి జంతు బలి చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో సురేష్ అనే యువకుడు మేక బలి ఇచ్చేందుకు ఒక మేకతో వచ్చాడు.
మేకతలను నరకడానికి సురేష్ దాని తలను గట్టిగా పట్టుకున్నాడు. కానీ మద్యం తాగి ఉన్న చలపతి మేక తలకు బదులు సురేష్ తలపై పెద్ద కత్తితో వేటు వేశాడు. ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఈ దృశ్యం చూసి షాక్కు గురయ్యారు. సురేష్ మెడపై కత్తితో గాయం కావడం తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సురేష్ అప్పటికే మృతిచెందాడని చెప్పారు.
పోలీసులు సురేష్ హత్య కేసులో చలపతిని అరెస్టు చేశారు. చలపతి తాగిన మత్తులో పొరపాటున సురేష్ తలపై వేటు వేశాడా.. లేక ఏమైనా ఇద్దరి మధ్య పాత కక్షలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి