Abn logo
Aug 9 2020 @ 14:23PM

రూటు మార్చిన అనీల్ రావిపూడి..?

ఈ ఏడాది సంక్రాంతికి సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాతో ముందుకొచ్చిన ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. అదే ఊపులో త‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్‌హిట్ మూవీ ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ను తెర‌కెక్కించాల‌నుకున్నారు. స్క్రిప్ట్ ప‌నిలో ఉండ‌గానే క‌రోనా ఎఫెక్ట్ ప్రారంభ‌మైంది. స్క్రిప్ట్ సిద్ధ‌మైంది కానీ.. క‌రోనా ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌లేదు. దీంతో ‘ఎఫ్ 3’ సినిమా స్టార్ట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. కానీ ఈలోపు అనీల్ రావిపూడి రూటు మార్చి త‌న క‌థ‌ను మ‌రో ద‌ర్శ‌కుడికి ఇచ్చి సినిమా చేసుకోమ‌న్నార‌ట‌. ఇంత‌కూ ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా? త‌్రినాథ‌రావు న‌క్కిన‌. నిర్మాత దిల్‌రాజు కోరిన మేర‌కు అనీల్ త‌న క‌థ‌ను త్రినాథ‌రావుకు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న క‌థ‌ల‌తోనే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ వ‌చ్చిన అనీల్ రావిపూడి ద‌ర్శ‌కుడిగా త‌న క‌థ‌ను మ‌రో ద‌ర్శ‌కుడికి ఇస్తుండ‌టం విశేషం. 

Advertisement
Advertisement
Advertisement