Advertisement

‘దృశ్యం 2’ ను ప్రశంసించిన ‘ఎఫ్ 3’ దర్శకుడు

విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా.. జీతు జోసెఫ్ తెరకెక్కించిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’. మలయాళ దృశ్యం 2 చిత్రానికిది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇందులోని  కోర్ట్ సీన్ ట్విస్ట్ కు థ్రిల్ అవుతున్నారు మన తెలుగు ప్రేక్షకులు. ఆల్రెడీ ఈ సినిమా మలయాళ వెర్షన్ ను చాలా వరకు తెలుగు ప్రేక్షకులు చూసేశారు. అయినా సరే ఈ సినిమాను కూడా ఆస్వాదిస్తున్నారు. మోహన్ లాల్ నటనని వెంకీ బాగా మ్యాచ్ చేశారని ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా ‘దృశ్యం 2’ చిత్రాన్ని వీక్షించిన దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ సినిమా మీద, వెంకీ నటన మీద ప్రసంశల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశారు.


‘ట్విస్టులు, టర్న్స్ తో ‘దృశ్యం 2’ సినిమా అద్భుతం అనిపించింది. రాంబాబుగా మన వెంకటేశ్ గారు మైండ్ గేమ్ తో అదరగొట్టారు.  ‘దృశ్యం 2’ చిత్రాన్ని మిస్ అవకండి’... అంటూ ట్వీట్ చేశారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకీ, వరుణ్ లతో ‘ఎఫ్ 3’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల సమ్మర్ సీజన్ లో విడుదల చేయబోతున్నట్టు ఇటీవల వెంకటేశ్ ప్రకటించారు. మరి ‘దృశ్యం 2’ చిత్రాన్ని ఇంకెందరు ప్రశంసిస్తారో చూడాలి. 


Advertisement