Abn logo
Mar 8 2021 @ 12:14PM

ఖరీదైన విల్లా సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి?

`పటాస్` సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ అరంగేట్రం చేసిన అనిల్ రావిపూడి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా ఎదిగాడు. అనిల్ ఇప్పటివరకు రూపొందించిన సినిమాలన్నీ విజయాలుగానే నిలిచాయి. ఈ నేపథ్యంలో అనిల్‌తో కలిసి పనిచేసేందుకు స్టార్ హీరోలు కూడా సిద్ధపడుతున్నారు. సూపర్‌స్టార్ మహేష్ హీరోగా అనిల్ ఇప్పటికే `సరిలేరు నీకెవ్వరు` వంటి విజయాన్ని అందుకున్నాడు. మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్నట్టు సమాచారం. అనిల్ ప్రస్తుతం `ఎఫ్2`కు సీక్వెల్‌గా `ఎఫ్3`ని తెరకెక్కిస్తున్నాడు. 

అనిల్ తాజాగా ఓ ఖరీదైన బంగ్లాను సొంతం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న అనిల్ ఇటీవల దాదాపు రూ.12 కోట్ల ఖరీదైన విల్లాను కొనుగోలు చేశాడట. కొండాపూర్ ప్రాంతంలో అనిల్ ఈ విల్లాను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్వయంగా ఇంటీరియర్ డిజైనింగ్ చేయిస్తున్నాడట. త్వరలోనే అనిల్ ఆ విల్లాలోకి ఫ్యామిలీని షిఫ్ట్ చేయబోతున్నాడట. 

Advertisement
Advertisement
Advertisement