Abn logo
Oct 4 2020 @ 11:51AM

అనీల్‌ రావిపూడి లేడీ ఓరియెంటెడ్‌ మూవీ...!

ఈ ఏడాది సంక్రాంతికి సూపర్‌స్టార్‌ మహేశ్‌తో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను తెరకెక్కించి సూపర్‌డూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్నాడు దర్శకుడు అనీల్‌ రావిపూడి. తదుపరి చిత్రంగా 'ఎఫ్‌ 2' సినిమాకు సీక్వెల్‌గా 'ఎఫ్‌ 3'ని తెరకెక్కించాలని అనుకున్నాడు. స్క్రిప్ట్‌ కూడా పూర్తయ్యింది. కానీ 'ఎఫ్‌ 2'లో నటించిన హీరోలు వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌లు కోవిడ్‌ ప్రభావంతో కమిట్‌ అయిన చిత్రాలను పూర్తి చేయలేకపోవడంతో ఈ సీక్వెల్‌లో నటించడానికి సమయం పడుతుందని చెప్పేశారు. దీంతో ఈ గ్యాప్‌లో అనీల్‌ రావిపూడి ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాను చేయడానికి రెడీ అయ్యాడట. ఈ సినిమాలో సాయిపల్లవిని నటింప చేయడానికి సంప్రదింపులు జరుగుతున్నాయని త్వరలోనే అనీల్‌ రావిపూడి తదుపరి సినిమాపై ఓ  క్లారిటీ రానుందని సినీ వర్గాల సమాచారం. 





Advertisement
Advertisement
Advertisement