కాణిపాకంలో అనిల్‌ రావిపూడి

ABN , First Publish Date - 2022-07-02T06:14:16+05:30 IST

త్వరలో నిర్మించనున్న కొత్త సినిమా కథకు వరసిద్ధుడి చెంత పూజ చేయించడానికి కాణిపాక క్షేత్రానికి వచ్చానని సినీ దర్శకుడు అనిల్‌రావిపూడి తెలిపారు.

కాణిపాకంలో అనిల్‌ రావిపూడి
స్వామి సేవలో పాల్గొన్న సినీ దర్శకుడు అనిల్‌ రావిపూడి

కొత్త సినిమా కథకు పూజ

ఐరాల(కాణిపాకం), జూలై 1: త్వరలో నిర్మించనున్న కొత్త సినిమా కథకు వరసిద్ధుడి చెంత పూజ చేయించడానికి కాణిపాక క్షేత్రానికి వచ్చానని సినీ దర్శకుడు అనిల్‌రావిపూడి తెలిపారు. గురువారం ఆయన కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్‌ కోదండపాణి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్ధప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్‌ మణినాయుడు, నరసింహులు నాయుడు, హేమాద్రి నాయుడు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-02T06:14:16+05:30 IST