Abn logo
Mar 26 2020 @ 16:01PM

అనిల్ రావిపూడి రూ. 10 ల‌క్ష‌ల విరాళం

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటానికి తెలుగు చిత్ర‌సీమ నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రభుత్వాలకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్ రూ. కోట్ల విరాళం ప్రకటించి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. రామ్ చరణ్, నితిన్, త్రివిక్రమ్, దిల్ రాజు, వినాయక్ ఇలా ప్రతి ఒక్కరూ ఈ కష్టకాలంలో ప్రభుత్వాలకు ఆసరాగా ఉండేందుకు తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు.  తాజాగా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతుగా మొత్తం రూ. 10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.


తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ నిధుల‌కు చెరో రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు గురువారం ఆయన ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌జ‌లంద‌రూ సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్ల‌ల్లో ఉండి లాక్‌డౌన్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలని కోరారు.


Advertisement
Advertisement
Advertisement