కరోనా వారియర్స్‌కు కుంబ్లే చేయూత

ABN , First Publish Date - 2020-05-29T09:10:21+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రాత్రి పగలు పోరాటం చేస్తున్న పోలీసులకు లెజెండరీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే చేయూతనిచ్చాడు...

కరోనా వారియర్స్‌కు కుంబ్లే చేయూత

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రాత్రి పగలు పోరాటం చేస్తున్న పోలీసులకు లెజెండరీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే చేయూతనిచ్చాడు. 1000 సేఫ్టీ కిట్‌లను గురువారం బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావుకు కుంబ్లే అందజేశాడు. ‘యువ’ అనే ఎన్జీఓతో కలిసి కుంబ్లే ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ సందర్భంగా కుంబ్లే మాట్లాడుతూ.. పోలీసులు ఆరోగ్య దృష్ట్యా కిట్‌లను పంపిణీ చేశామన్నాడు. కరోనా నియంత్రణలో పోలీసుల కృషి మరువలేమన్నాడు. ప్రతి కిట్‌లో సబ్బు, శానిటైజర్‌, మాస్కు, రోగనిరోధక మందులు ఉన్నాయన్నాడు. 


Updated Date - 2020-05-29T09:10:21+05:30 IST