ఈడీకి ముళ్లీ ముఖం చాటేసిన అనిల్ దేశ్‌ముఖ్

ABN , First Publish Date - 2021-08-02T22:09:35+05:30 IST

మనీ లాండరింగ్ కేసులో ఈడీకి మరోసారి మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్..

ఈడీకి ముళ్లీ ముఖం చాటేసిన అనిల్ దేశ్‌ముఖ్

ముంబై: మనీ  లాండరింగ్ కేసులో ఈడీకి మరోసారి మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ముఖం చాటేశారు. ఈడీ విచారణలో భాగంగా సోమవారం ఆయన హాజరుకావాల్సి ఉండగా, ఆయన విచారణకు గైర్హాజర్ అయినట్టు ఈడీ అధికారులు తెలిపారు. తన న్యాయవాది ఇంద్రపాల్ సింగ్ ద్వారా రెండు పేజీల లేఖను ఈడీకి దేశ్‌ముఖ్ పంపారు. తన ప్రతినిధిని పంపుతున్నట్టు ఆయన తెలిపారు. గతంలో దేశ్‌ముఖ్‌ను తమ ముందు హాజరుకావాలని ఈడీ మూడుసార్లు సమన్లు పంపింది. అయితే, ఆ మూడుసార్లు ఆయన గైర్హాజరయ్యారు. దీంతో గత శుక్రవారంనాడు దేశ్‌ముఖ్‌కు, ఆయన కుమారుడు హృషికేష్ దేశ్‌ముఖ్‌కు ఈడీ మరోసారి సమన్లు పంపింది. సోమవారం హాజరుకావాలని కోరింది. ఈ కేసులో దేశ్‌ముఖ్ స్టేట్‌మెంట్ రికార్డు చేయాల్సి ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. అనిల్ దేశ్‌ముఖ్ తనపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలతో గత ఏప్రిల్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. గత నెలలో అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.4.20 కోట్ల విలువచేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Updated Date - 2021-08-02T22:09:35+05:30 IST