మాజీ హోం మంత్రికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ABN , First Publish Date - 2021-11-15T20:24:57+05:30 IST

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను రెండు వారాల పాటు జ్యుడిషియల్ కస్టడీకి...

మాజీ హోం మంత్రికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను రెండు వారాల పాటు జ్యుడిషియల్ కస్టడీకి స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కోర్టు సోమవారంనాడు ఆదేశించింది. ఆహారం, పడక (బెడ్), మందుల కోసం అనిల్‌దేశ్‌ముఖ్ న్యాయవాది అప్పీల్ చేసుకున్నారు. తన క్లయింట్ వయస్సు, ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనకు మంచం, జైలు వైద్యుల కన్సల్టేషన్‌తో సంబంధిత మెడిసన్లు సమకూర్చాలని కోర్టు అదేశించింది. ఇంటి నుంచి వండి పంపిన ఆహారాన్ని అనుమతించాలనే విజ్ఞప్తిని మాత్రం పెండింగ్‌లో ఉంచింది.


మనీ లాండరింగ్ కేసులో ఇటీవల 12 గంటల సేపు అనిల్ దేశ్‌ముఖ్‌ను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్టు చేసింది. ఈడీ రిమాండ్‌కో కోర్టు పంపగా, ఆ రిమాండ్‌ను పొడిగించాలంటూ ఈడీ చేసుకున్న విజ్ఞప్తిని ప్రత్యేక హాలిడే కోర్టు నవంబర్ 7న తోసిపుచ్చింది. ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. అయితే, ఒకరోజు తర్వాత దిగువ కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వును ముంబై హైకోర్టు తోసిపుచ్చుతూ, నవంబర్ 12 వరకూ ఈడీ రిమాండ్‌కు దేశ్‌ముఖ్‌ను పంపింది.

Updated Date - 2021-11-15T20:24:57+05:30 IST