ఎన్సీడీ చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలం... ఇది 49 వ సారి

ABN , First Publish Date - 2021-02-24T02:24:48+05:30 IST

నాన్ కన్వర్జిబుల్ డిబెంచర్స్ చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ వైఫల్యం చెందుతోంది. నాన్ కన్వర్జిబుల్ డిబెంచర్స్(ఎన్‌సీడీస్)కు సంబంధించిన చెల్లింపుల్లో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ సంస్థ వరుసగా వైఫల్యం చెందుతోంది. వివరాలిలా ఉన్నాయి.

ఎన్సీడీ చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలం... ఇది 49 వ సారి


ముంబై : నాన్ కన్వర్జిబుల్ డిబెంచర్స్ చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ వైఫల్యం చెందుతోంది. నాన్ కన్వర్జిబుల్ డిబెంచర్స్(ఎన్‌సీడీస్)కు సంబంధించిన చెల్లింపుల్లో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ సంస్థ వరుసగా వైఫల్యం చెందుతోంది. వివరాలిలా ఉన్నాయి.


ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే ఎన్‌సీడీస్ కు సంబంధించి ఈ చెల్లింపులు జరపాల్సి ఉంది. కాగా ఈ పరిస్థితినెదుర్కోవడం అనిల్ అంబానీకి ఇది 49 వ సారి కావడం గమనార్హం. కాగా... డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి... రూ. 14,827 కోట్ల విలువైన ఎన్‌సీడీలు లిస్ట్ అయినట్లుగా యాజమాన్యం పేర్కొంది.


ఇక... హెచ్‌డీఎఫ్‌సీ, ఏక్సిస్ బ్యాంకులకు సంబంధించి కిందటి సంవత్సరం జనవరి 31 నుంచి ఈ ఏడాది జనవరి 30 వరకు పదకొండు వాయిదాలను రిలయన్స్ క్యాపిటల్ చెల్లించలేదు. 

Updated Date - 2021-02-24T02:24:48+05:30 IST