కంపెనీలో ఉద్యోగం లభించలేదని పగబట్టిన యువకులు.. ఆ తరువాత ఏం చేయబోయారంటే..

ABN , First Publish Date - 2022-02-21T05:37:36+05:30 IST

దేశంలో నిరుద్యోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. నిరుద్యోగ యువతలో కొందరు తమ మేధస్సును పెడదారిలో ఉపయోగిస్తున్నారు. ఇలాంటిదే ఒక తాజా ఘటనలో ముగ్గురు యువకులు తమకు అర్హతులున్నా ఉద్యోగం...

కంపెనీలో ఉద్యోగం లభించలేదని పగబట్టిన యువకులు.. ఆ తరువాత ఏం చేయబోయారంటే..

దేశంలో నిరుద్యోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. నిరుద్యోగ యువతలో కొందరు తమ మేధస్సును పెడదారిలో ఉపయోగిస్తున్నారు. ఇలాంటిదే  ఒక తాజా ఘటనలో ముగ్గురు యువకులు తమకు అర్హతులున్నా ఉద్యోగం ఇవ్వలేదని ఒక సంస్థపై పగబట్టారు. దానిపై దాడి చేసేందుకు భారీ సన్నాహాలు చేస్తుండగా.. పోలీసులు సమయానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు.


వివరాల్లోకి వెళితే.. ఘార్ఖండ్ రాష్ట్రంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరుకుంది. అక్కడ ఉద్యోగాలు లభించక యువత తమలో ఉన్న అసహనంతో వినాశనం వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలోని ధన్‌బాద్ జిల్లా పోలీసులకు కొందరు యువకులు వద్ద నాటుబాంబుల, తుపాకులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీ చేసి.. రెండు నాటు బాంబులు, బాంబు తయారు చేసే సామాగ్రితో పాటు ఒక నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఆ బాంబులు తయారు చేసిన వారిలో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నారు. 


ఆ బాంబులు తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చిన యువకుల గురించి పోలీసులు విచారణ చేసి వారి ఆచూకీ తెలుసుకున్నారు. కానీ ఆ యువకులు పరారీలో ఉన్నారు. ఆ యువకులు గురించి విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. 


పోలసుల కథనం ప్రకారం.. ఆ యువకులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ధన్‌బాద్ జిల్లాలోని అంబె కోల్(బొగ్గు) అవుట్ సోర్సింగ్ కంపెనీలో ఇంటర్‌వ్యూకు వెళ్లిన ముగ్గురు యువకులు తమకు అన్నీ అర్హతులున్నా కంపెనీ యజమాన్యం ఉద్యోగం ఇవ్వలేదన్న కారణంగా నిరాశకు గురయ్యారు. ఆ తరువాత ఆ కంపెనీ యజమాన్యానికి బుద్దిచెప్పాలని నిర్ణియించుకున్నారు. అందుకోసం కంపెనీ ఆఫీసుపై నాటుబాంబులతో దాడి చేయాలని ప్లానింగ్ చేసుకున్నారు.మ ఆ తరువాత స్థానికంగా నాటుబాంబుల తయారుచేసేవారికి కొంత డబ్బులు అడ్వాన్స్ ఇచ్చారు. కానీ పోలీసులు దీని గురించి సరైన సమయంలో సమాచారం అందుకొని తనిఖీ చేసి ఆ దాడిని అడ్డుకున్నారు.


ప్రస్తుతం పోలీసులు బాంబుల తయారు చేసిన ఇద్దరు మైనర్ బాలురను జువెనైల్ కారాగారానికి పంపించారు. పరారీలో ఉన్న ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Updated Date - 2022-02-21T05:37:36+05:30 IST