రెచ్చిపోతున్న వేటగాళ్లు!

ABN , First Publish Date - 2022-08-07T05:11:22+05:30 IST

గంగవరం మండలంలోని అటవీ ప్రాంతంలో జంతువుల వేటలో వేటగాళ్లు రెచ్చి పోతున్నారు. ఆదివారం వస్తుందంటే ముందుగానే పంటపొలాల సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతంలో మందుగుండ్లు అమర్చి జంతువులను చంపి ఆర గించేస్తున్నారు.

రెచ్చిపోతున్న వేటగాళ్లు!
మందుగుండు పేలి తీవ్రంగా గాయపడిన పాడిఆవు

అడవిలో మందుగుండ్ల ఏర్పాటు


అవి పేలి పశువుకు తీవ్రగాయాలు


గంగవరం, ఆగస్టు 6: మండలంలోని అటవీ ప్రాంతంలో  జంతువుల వేటలో వేటగాళ్లు రెచ్చి పోతున్నారు. ఆదివారం వస్తుందంటే ముందుగానే పంటపొలాల సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతంలో మందుగుండ్లు అమర్చి  జంతువులను చంపి ఆర గించేస్తున్నారు. అటవీశాఖ అధికారుల నామమా త్రపు తనిఖీలతో పాటు కొంతమంది క్షేత్రస్థాయి అధికారుల లాలూచీతో వేటగాళ్లు బరితెగిస్తున్నారు. ఇందుకు శనివారం మందుగుండు పేలి ఓ పశువు తీవ్రంగా గాయపడడమే నిదర్శనం. కలగటూరు గ్రామానికి చెందిన నిరుపేద రైతు మారప్ప తన పశువులను పంటపొలాల సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్లాడు. అక్కడ అప్పటికే వేట గాళ్లు మందుగుండును పచ్చగడ్డిలో దాచిపెట్టారు. ఇంతలో ఓ పశువు గడ్డిమేస్తూ మందుగుండును తాకిన క్షణంలోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో పాడిఆవు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సంబంధిత అధికారులు స్పం దించి మందుగుండు అమర్చిన నిందితులపై చర్య లు తీసుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నాడు. 

Updated Date - 2022-08-07T05:11:22+05:30 IST