Oct 27 2021 @ 17:57PM

‘ఎవెంజ‌ర్స్‌’కి మించిన ప‌వ‌ర్స్‌తో దీపావళికి ‘ఎటెర్నల్స్‌’

ఎవెంజ‌ర్స్ సిరీస్ ఎండ్ అవ్వ‌డంతో హాలీవుడ్ మూవీ ల‌వ‌ర్స్ ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ ‘ఎటెర్నల్స్‌’ పేరుతో కొత్త సూప‌ర్ హీరోల్ని సృష్టించింది. దీపావళి సందర్భంగా నవంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జూలీ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. థేనా అనే సూప‌ర్ వుమెన్ గెటెప్‌లో ఏంజెలీనా త‌న ఫ్యాన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతున్నారు.


ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్‌లో ఏంజెలినా జూలీ, రిచర్డ్‌ మాడన్‌ వంటి 10 మంది సెలెబ్రిటీల పెళ్ళి దృశ్యాలు ఉన్నాయి. మార్వెల్‌ స్టూడియో తన 25వ చిత్రంగా నిర్మితమైన ఈ చిత్రంలో పది మంది కొత్త హీరోలు పరిచయం కానున్నారు. ఎవెంజ‌ర్స్‌కి మించిన ప‌వ‌ర్స్‌తో ‘ఎటెర్నల్స్‌’లో సూప‌ర్ హీరోలు అద్భుత‌మైన విన్యాసాలు చేయనున్నారని, బిగ్ స్క్రీన్‌పై వారు ప్రేక్ష‌కుల‌కి వీనుల విందు ఇవ్వ‌నున్న‌ారని మూవీ టీమ్ ప్ర‌క‌టించింది.