శివలీల మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ, గ్రామస్తులు
యాలాల, జనవరి 24: కుటుంబల కలహాల తో అంగన్‌వాడీ టీచర్ ఆ త్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం అగ్గనూరులో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. అగ్గనూరుకు చెందిన శివలీల(43) అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. ఆదివారం రాత్రి ఆమెకు భర్త శ్రీనివా్‌సరెడ్డితో చిన్న గొడవ జరిగింది. సోమవారం ఉదయం శివలీల పనినిమిత్తం తాండూరు వెళుతున్నట్లు చెప్పి జుంటుపల్లి ప్రాజెక్టుకు వెళ్లి దానిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శంకర్ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతురాలు శివలీలగా గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.