Abn logo
Sep 21 2021 @ 23:24PM

అంగన్వాడీ, ఆశాలను రెగ్యులర్‌ చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌

ముద్దనూరు, సెప్టెంబరు21: అంగన్వాడీ, ఆశా, యానిమేటర్లను  రెగ్యులర్‌ చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహం ఆవరణలో మంగళవారం నియోజకవర్గ స్థాయి ఆశా వర్కర్ల సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఆశా, అంగన్వాడీ , మధ్యాహ్నభోజనం కార్మికులు, యానిమేటర్లను రెగ్యులర్‌ చేయడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కార్మికుల సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలన్నారు.  వారికి కనీసం వేతం రూ.24వేలు ఇవ్వాలన్నారు.  కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు చంద్రశేఖర్‌, చాంద్‌బాషా, సీపీఐ ఏరియా సహాయ కార్యదర్శి ప్రసాద్‌, లోకేష్‌, ఆశావర్కర్లు సరళ, నాగకుమారి, పద్మావతి, నీలవేణి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.