Abn logo
Sep 24 2021 @ 23:49PM

స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు

- కనీస వేతనం అమలు చేయాలి

- సీఐటీయూ జిల్లా కార్యదర్శి నరసింహ

- అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తల ఆందోళన

- జిల్లా వ్యాప్తంగా నిరసనలు

గద్వాల క్రైం/ గట్టు/ వడ్డేపల్లి/ ఇటిక్యాల/ అలంపూర్‌/ ధరూరు. సెప్టెంబరు 24 : కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన స్కీములను యథావిధిగా కొనసాగించి, బడ్జెట్‌ పెంచాలని, అంగన్‌వాడీ, ఆశ కార్య కర్తలకు కనీస వేతనం అమలు చేయాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు శుక్రవారం కలెక్టరేట్‌ ముందు ధర్నా చేశారు. అనం తరం అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఆందోళనలో అంగన్‌వాడీ సం ఘం జిల్లా అధ్యక్షురాలు రత్నమ్మ, సుమలత, రేణుక, ఆశ కార్యకర్తల యూనియన్‌ నాయకులు పద్మ, సునీత, జయమ్మ, సీఐటీయూ నాయకుడు సీతారాములు పాల్గొన్నారు. 


- కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని, కస్తూర్బా హాస్టల్‌ వర్కర్లకు పీఆర్సీ అమలు చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు హనుమంతు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద శుక్రవారం వారు ధర్నా చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా కోశాధికారి కార్తీక్‌, హాస్టల్‌ వర్కర్స్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు నాగమ్మ, ఈరమ్మ, శశికళ, పద్మమ్మ, తిరుపతమ్మ, సిద్ధమ్మ, కవిత ఉన్నారు.


- స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం గట్టు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బత్తలయ్య, వీవీ నరసింహ, ఐకేపీ వీఓఏలు సురేష్‌, వీరన్న, మహేశ్‌, నాగరాజు, నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, ఆలూరు ప్రకాష్‌ గౌడు, ప్రజాఫ్రంట్‌ నాయకుడు ప్రభాకర్‌, రైతాంగ సమితి నాయకుడు గోపాల్‌యాదవ్‌ పాల్గొన్నారు.


- పనిభారం తగ్గించాలంటూ అంగన్‌వాడీ ఉద్యోగు లు ఇటిక్యాల డిప్యూటీ తహసీల్దార్‌ సత్యలింగంకు శుక్రవారం వినతిపత్రం అందించారు. అంతకుముందు అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా సమాఖ్య లీటర్లు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీతమ్మ, బీరమ్మ, శివమ్మ, సరస్వతి, రాజేశ్వరి, యశోద, వరలక్ష్మి పాల్గొన్నారు.


- వడ్డేపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయం ముందు శుక్రవారం కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌ అబ్రహం లింకన్‌కు వినతిపత్రం అందిం చారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ రాష్ట్ర నాయకుడు పరంజ్యోతి, లక్ష్మి, కృష్ణారావు, లీలావతి, మాణిక్యమ్మ, దానమ్మ, అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు.


- స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించా లని డిమాండ్‌ చేస్తూ అలంపూర్‌ ఎంపీడీవో కార్యాల యం ముందు శుక్రవారం అంగన్‌వాడీ టీచర్లు, ఆయా లు, ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ మదన్‌మోహన్‌కు వినతిపత్రం అందిం చారు. కార్యక్రమంలో కార్యక్రమంలో  కేవీపీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఇంతి యాజ్‌ అలీ, అంగన్‌వాడీ జిల్లా కార్యదర్శి ఎమేలమ్మ, సీఐటీయూ మండల కార్యదర్శి నరసింహ, కేవీపీఎస్‌ నాయకుడు అయ్యప్ప, కేవైఎఫ్‌ఐ జిల్లా నాయకుడు బంగారు రఫీ పాల్గొన్నారు. 


- స్కీమ్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ధరూరు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆశ వర్కర్లు, ఐకేపీ వీవోఏలు శుక్రవారం ధర్నా చేశారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, 21 వేల జీతం ఇవ్వాలని, ఆరోగ్య స్కీమ్‌ అమలు చేయాలని, కరోనాతో చనిపోయిన కార్మికుల కటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఐకేపీ వీఏవోల సంఘం జిల్లా నాయకులు డ్యాం అంజి, తిమ్మప్ప, ఆశ వర్కర్ల సంఘం నాయకురాలు రమాదేవి, లక్ష్మి, హమాలీ కార్మికులు ప్రవీణ్‌, గోవిందు తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

గట్టు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న దృశ్యం