అంగన్‌వాడీల అభివృద్ధికి చర్యలు

ABN , First Publish Date - 2021-04-17T05:29:21+05:30 IST

అంగన్‌వాడీల అభివృద్ధికి చర్యలు

అంగన్‌వాడీల అభివృద్ధికి చర్యలు
మాట్లాడుతున్న పీడీ ఉమారాణి

 గన్నవరం, ఏప్రిల్‌ 16 : అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్ర్తీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.ఉమారాణి అన్నారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయంలో నాడు-నేడుపై శుక్రవారం శిక్షణ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ ఉమారాణి మాట్లాడుతూ అంగన్‌ వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు-నేడు చేపట్టిందని తెలిపారు. అంగన్‌వాడీల్లో వసతులను మెరుగుపరచటంతో పాటు కొత్త నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పనులన్ని అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి కమిటీల ద్వారా జరుగుతాయని చెప్పారు. మండ లంలో 11 అంగన్‌వాడీ సెంటర్‌లను ఎంపికైనట్లు చెప్పారు. సీడీపీవో పి.వెంకటలక్ష్మి, హౌసింగ్‌ ఏఈ ఎస్‌వై చౌదరి, ఏసీడీపీవో కె.బి. సుకన్య, సూపర్‌వైజర్‌లు బేబీ రాణి, నసీరున్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీలకు శిక్షణ 

మైలవరం (జి.కొండూరు) : మన అంగన్‌వాడీ, నాడు - నేడు పథకం అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ సభ్యులకు శుక్రవారం ఐసీడీఎస్‌ కార్యాలయంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో సూరిబాబుపేట, వెల్వడం - 2, 4, 5 అంగన్‌వాడీ సెంటర్లకు నూతన భవనాలు మంజూరయ్యాయి. కని మెర్ల, గణపవరం - 3, జంగాలపల్లి, పుల్లూరు - 1, మొర్సుమిల్లి - 2, వెల్వడం - 1 కేంద్రాల్లో ఉన్న వసతులను మెరుగు పర్చనున్నారు. కమిటీ సభ్యులకు అధికారులు శిక్షణ నిర్వహించారు. కొత్త భవనాలు ఎలా కట్టుకోవాలి, పాత వాటిలో వసతులు ఎలా మెరుగుపర్చాలి తదితర పనులను కమిటీ సభ్యులే స్వయంగా నిర్వహించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ డీఈ నాగమల్లేశ్వరరావు, సీడీపీవో రత్నకుమారి, ఎంపీడీవో డి.సుబ్బారావు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 

నేడు రెడ్డిగూడెంలో.. 

రెడ్డిగూడెం :  స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం అంగన్‌ వాడీ అభివృద్ధి కమిటీలకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీడీపీవో లలితకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడీల అభివృద్ధికి కమిటీలు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమగ్రంగా శిక్షణ ఇస్తారని, కమిటీ సభ్యులందరూ పాల్గొనాల్సిందిగా కోరారు. 

Updated Date - 2021-04-17T05:29:21+05:30 IST