అంగన్‌వాడీ చిన్నారులకు గాయాలు

ABN , First Publish Date - 2021-03-03T05:30:00+05:30 IST

కుక్కర్‌ విజిల్‌ లీకై చిన్నారులు గాయపడిన ఘటనలో అంగన్‌వాడీ టీచర్‌, ఆయాలకు మెమోలు అందజేశా మని ఐసీడీఎస్‌ అదికారి వెంకాయమ్మ తెలిపారు.

అంగన్‌వాడీ చిన్నారులకు గాయాలు

కుక్కర్‌ విజిల్‌ లీకవ్వడంతో ప్రమాదం 

సిబ్బందికి మెమోలు

జంగారెడ్డిగూడెంటౌన్‌, మార్చి 3 : కుక్కర్‌ విజిల్‌ లీకై చిన్నారులు గాయపడిన ఘటనలో అంగన్‌వాడీ టీచర్‌, ఆయాలకు మెమోలు అందజేశా మని ఐసీడీఎస్‌ అదికారి వెంకాయమ్మ తెలిపారు. మంగిశెట్టిగూడెంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించి ప్రమాదం తీరును అడి గి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రంలో పప్పు వండుతున్న సమయంలో కుక్కర్‌కు ఉన్నటువంటి సేఫ్టీ వాల్‌ పనిచేయకపోవడంతో ఒక్కసారిగా కుక్కర్‌ గిన్నె ఎగిరి కిందపడిందన్నారు. ఉడుకుతున్న వేడినీళ్లు అదే గదిలో ఆడుకుంటున్న చిన్నారులపై ఎగజిమ్మా యని, ఈ ఘటనలో గండ్రోతు సునంద, పిల్లంటి రిశ్వంత్‌లతో పాటు మరికొంతమంది చిన్నారులకు  స్వల్పగాయాలయ్యా యన్నారు. చిన్నారులను స్థానిక పీహెచ్‌సీలో చికిత్స అందించి, జంగారెడ్డిగూడెంలోని  ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారన్నారు. 

వేర్వేరుగా గదులు కేటాయించాలి..

అంగన్‌వాడీ కేంద్రంలో వంటతో పాటు, ప్రీ స్కూల్‌ను ఒకే గదిలో నిర్వహించడం తగదు. అధికారులు దృష్టి సారించి వంటగది వేరుగా, పాఠశాల గది వేరేగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

– పల్లంటి మంగ, బాధిత చిన్నారి తల్లి

Updated Date - 2021-03-03T05:30:00+05:30 IST