172 జీవోను రద్దు చేయాలని అంగన్‌వాడీల నిరసన

ABN , First Publish Date - 2021-07-27T03:30:54+05:30 IST

జీవో నెంబరు 172ను రద్దు చేయాలని అంగన్‌వాడీలు సోమవారం బుచ్చిలోని ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ముం

172 జీవోను రద్దు చేయాలని అంగన్‌వాడీల నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు.

బుచ్చిరెడ్డిపాళెం,జూలై26: జీవో నెంబరు 172ను రద్దు చేయాలని అంగన్‌వాడీలు సోమవారం బుచ్చిలోని ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ముందుగా స్థానిక సీపీఎం కార్యాలయం వద్ద నుంచి ఐసీడీఎస్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి నిరసన చేపట్టారు. జిల్లా నాయకురాలు ఎల్వీ శేషమ్మ మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని  ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో పద్మలత, కవిత, వజ్రమ్మ, విజయభారతి, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T03:30:54+05:30 IST