రేపటి నుంచి రక్తహీనత సర్వే

ABN , First Publish Date - 2020-09-27T10:18:07+05:30 IST

దేశంలో 2022 నాటికి రక్తహీనతను పూర్తిగా నివారించేందుకు భారత ప్రభుత్వం ఎనీమియా ముక్త భారత్‌ పథఽకం అమలు

రేపటి నుంచి రక్తహీనత సర్వే

డీఎంహెచ్‌వో యాస్మిన్‌  


గుంటూరు (మెడికల్‌) సెప్టెంబర్‌ 26: దేశంలో 2022 నాటికి రక్తహీనతను పూర్తిగా నివారించేందుకు భారత ప్రభుత్వం ఎనీమియా ముక్త భారత్‌ పథఽకం అమలు చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌ తెలిపారు. శనివారం తన  ఛాంబర్‌లో ఆమె హీమోగ్లోబిన్‌ పరికరాలను ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా రక్తహీనత గుర్తించేందుకు సర్వే చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 94 వేల మంది గర్భిణులు, 89 వేల మంది బాలింతలకు ఐరన్‌, ఫోలిక్‌ యాసీడ్‌ మాత్రలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఆరోగ్య కార్యకర్తలు తమ ఇళ్లకు సర్వేకు వచ్చినప్పుడు మహిళలు తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయించుకోవాలని కోరారు. 

Updated Date - 2020-09-27T10:18:07+05:30 IST