ఐపీఎల్ నయా ఫ్రాంచైజీ లక్నో కోచ్‌గా ఆండీ ఫ్లవర్

ABN , First Publish Date - 2021-12-18T00:41:29+05:30 IST

ఐపీఎల్‌లోకి కొత్తగా వచ్చి చేరిన రెండు కొత్త జట్టలో ఒకటైన లక్నోకి ఆండీ ఫ్లవర్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు లక్నో ఫ్రాంచైజీ అతడితో ఒప్పందం..

ఐపీఎల్ నయా ఫ్రాంచైజీ లక్నో కోచ్‌గా ఆండీ ఫ్లవర్

ముంబై: ఐపీఎల్‌లోకి కొత్తగా వచ్చి చేరిన రెండు కొత్త జట్టలో ఒకటైన లక్నోకి ఆండీ ఫ్లవర్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు లక్నో ఫ్రాంచైజీ అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. జింబాబ్వే మాజీ కెప్టెన్, ఇంగ్లండ్ మాజీ హెడ్ కోచ్ అయిన ఫ్లవర్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఖ్యాతిగాంచాడు. 2020, 21 సీజన్‌లలో పంజాబ్ కోచ్‌గానూ వ్యవహరించాడు. కోచ్‌గా ఎంపికైన అనంతరం ఫ్లవర్ మాట్లాడుతూ.. ఇది గొప్ప అవకాశమని సంతోషం వ్యక్తం చేశాడు. 


ఆటగాడిగా, కోచ్‌గా క్రికెట్ చరిత్రలో ఫ్లవర్ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడని లక్నో ఫ్రాంచైజీ యజమాని, ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయెంకా ప్రశంసించారు. లక్నో జట్టుకు ఆండీ ఫ్లవర్ కోచ్‌గా రావడం ఖాయమని ముందే ఊహించారు. పంజాబ్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్, ఫ్లవర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ లక్నో వైపు చూస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. పంజాబ్‌ జట్టులో కొనసాగకూడదని రాహుల్ నిర్ణయించుకున్న తర్వాత ఫ్లవర్ కూడా పంజాబ్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు లక్నోతో ఒప్పందం కుదుర్చుకోవడంతో గతంలో వచ్చిన వార్తలు నిజమేనని తేలింది.


Updated Date - 2021-12-18T00:41:29+05:30 IST