Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేను రాజీనామా చేయను: ఆండ్రూ క్యూమో

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ముగ్గురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మాజీ మహిళా ఉద్యోగులైన లిండ్సే బోయ్లాన్, షార్లెట్ బెన్నెట్‌తో పాటు అన్నా రూచ్ అనే మహిళ కూడా తమపై క్యూమో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ ఆరోపణలపై క్యూమో బుధవారం స్పందించారు. తనపై ముగ్గురు మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో తాను తన పదవికి రాజీనామా చేయబోనని అన్నారు. ఒకవేళ తనకు తెలియకుండా తన ప్రవర్తనతో ఆ ముగ్గిరిని బాధపెట్టి ఉంటే తనను క్షమించాలని క్యూమో వారిని కోరారు. తాను ఎప్పుడూ వారిని అసభ్యంగా తాకలేదన్నారు. అలాగే  నిజానిజాలేంటో తెలియకముందే ప్రజలు తన పట్ల ఓ అభిప్రాయానికి రావొద్దని కోరారు.    

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement