Jul 23 2021 @ 14:39PM

వెట్రిమార‌న్ మూవీలో ఆండ్రియా

మల్టీ టాలెంటెడ్‌ నటిగా గుర్తింపుపొందిన ఆండ్రియాకు ఇపుడు వరుస  అవకాశాలు వస్తున్నాయి. గాయనిగా ఇప్పటికే ప్రూవ్‌ చేసుకున్న ఆండ్రియా.. నటిగా కూడా బిజీగా గడుపుతోంది. ‘మంగాత్త’, ‘విశ్వ రూపం’, ‘అరణ్‌మనై’, ‘వడ చెన్నై’, ‘తరమణి’, ‘మాస్టర్‌’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె... సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా వుంటుంది. అంతేకాకుండా, సామాజిక అంశాలపై ఆమె సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటుంది. ప్రస్తుతం మిషికన్‌ దర్శకత్వంలో ‘పిశాచు-2’ చిత్రంలో నటిస్తున్న ఆండ్రియా నూతన దర్శకుడు ఆనంద్‌ తెరకెక్కించే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ తన సొంత సంస్థ గ్రాస్‌ రూట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ 16 రోజులపాటు పూర్తి చేశారు. రెండో దశ షెడ్యూల్‌ ప్రారంభంకానుంది.