Andhra news: పోలీసుల గుప్పెట్లో తెంపల్లి గ్రామం

ABN , First Publish Date - 2022-07-21T17:03:12+05:30 IST

కృష్ణా జిల్లా తెంపల్లి గ్రామం పోలీసుల గుప్పెట్లోకి వెళ్లింది. తెలుగుదేశం నాయకులు తెంపల్లి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీస్ పహారా కాసస్తున్నారు.

Andhra news: పోలీసుల గుప్పెట్లో తెంపల్లి గ్రామం

అమరావతి: కృష్ణా జిల్లా తెంపల్లి గ్రామం పోలీసుల గుప్పెట్లోకి వెళ్లింది. తెలుగుదేశం నాయకులు(TDP leaders) తెంపల్లి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీస్ పహారా కాసస్తున్నారు. కంకిపాడు, పెనమనూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం స్టేషన్ నుంచి భారీగా పోలీసులు తెంపల్లికి చేరుకున్నారు.తెంపల్లి గ్రామంలోనికి ప్రవేశం లేకుండా చుట్టూ పోలీసుల వలయం ఏర్పాటు చేశారు. బారికేడ్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. పెద్ద ఆవుటుపల్లి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. దీంతో తెంపల్లి గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. 

Updated Date - 2022-07-21T17:03:12+05:30 IST