కొత్త జిల్లాల ఏర్పాటులో కొన్ని సవరణలు అవసరం: లంకా దినకర్

ABN , First Publish Date - 2022-02-23T16:10:16+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటులో కొన్ని సవరణలు అవసరమని బీజేపీ నేత లంకా దినకర్ తెలిపారు.

కొత్త జిల్లాల ఏర్పాటులో కొన్ని సవరణలు అవసరం: లంకా దినకర్

అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటులో కొన్ని సవరణలు అవసరమని బీజేపీ నేత లంకా దినకర్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను ఒంగోలు కేంద్రంగా తూర్పు ప్రకాశం జిల్లా, మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలుగా వికేంద్రీకరణ ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశం జిల్లా దీర్ఘకాలిక ప్రజా ఆకాంక్ష అని తెలిపారు. భౌగోళికంగా కందుకూరు, అద్దంకిలను ఒంగోలు కేంద్రంగా తూర్పు ప్రకాశం జిల్లాలో కలపడం అవసరమని చెప్పారు. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అయిన  కందుకూరుని ఎత్తివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో తలెత్తిన సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించకుంటే దీర్ఘకాలిక సమస్యలు తప్పవని లంకా దినకర్ హెచ్చరించారు. 

Updated Date - 2022-02-23T16:10:16+05:30 IST