శ్రీ సత్య సాయి: పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ హిందూపురంలో అఖిలపక్షం ఆందోళనకు దిగింది. అంబేద్కర్ సర్కిల్లో ప్లకార్డులు నల్ల జెండాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్సీ అహ్మద్ హిందూపురం, ఎంపీ గోరంట్ల మాధవ్... మూర్ఖులు అంటూ బీసీ సంక్షేమ సంఘం నేత చలపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చలపతి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అఖిలపక్ష నేతలతో తీవ్రస్థాయిలో వాగ్వాదం... తోపులాటకు దారి తీసింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి