డిసెంబర్ 17న చలో విజయవాడ

ABN , First Publish Date - 2021-11-27T22:28:02+05:30 IST

డిసెంబర్ 17న చలో విజయవాడ

డిసెంబర్ 17న చలో విజయవాడ

ఢిల్లీ: డిసెంబర్ 17న చలో విజయవాడ నిర్వహిస్తామని  ఆల్ ఇండియా రేషన్ డీలర్ల సంఘం కార్యదర్శి బిశ్వంభర బసు తెలిపారు. రేషన్ పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఇంటింటికీ రేషన్ విధానం తెచ్చారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వమే మూడో పార్టీని తీసుకువచ్చిందని చెప్పారు. మొబైల్ డిస్పెన్సరీ విధానంతో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. గన్ని బ్యాగుల విక్రయంపై తెచ్చిన జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్పీజీ గ్యాస్ సహా అన్ని రకాల నిత్యావసరాలను రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరలకు విక్రయించాలన్నారు. 

Updated Date - 2021-11-27T22:28:02+05:30 IST