ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. ఇవాళ ఒక్కరోజే...

ABN , First Publish Date - 2020-08-09T00:11:09+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ విజృంభిస్తోంది.

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. ఇవాళ ఒక్కరోజే...

అమరావతి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. గత 24 గంటలుగా ఏపీలో కొత్తగా 10,080  కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 97 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 1,939 మంది మృతి చెందారు. కర్నూలు జిల్లాలో- 1,353, తూర్పుగోదావరిలో- 1,310, అనంతపురంలో-976, చిత్తూరు జిల్లాలో- 963, నెల్లూరులో- 878, విశాఖపట్నం- 998, గుంటూరు- 601, కడప- 525, పశ్చిమ గోదావరిలో- 681, విజయనగరంలో- 450, శ్రీకాకుళంలో- 442, కృష్ణాలో- 391, ప్రకాశంలో- 512 కేసులు నమోదయ్యాయి. 


ఏపీలో ఇప్పటి వరకు 24,24,393 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 2,14,145 పాజిటివ్ కేసులకు గాను 1,26,720 మంది డిశ్చార్జ్ కాగా 1,939 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85,486. కాగా.. కర్నూలు, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి రోజూ ఏపీలో పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. అయితే.. టెస్టులు పెద్ద ఎత్తున చేస్తుండటంతో కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు.


ఏయే జిల్లాల్లో ఎన్నెన్ని కేసులు..!?



Updated Date - 2020-08-09T00:11:09+05:30 IST