ఏపీలో ఐటీ రూటు ఎటు?

ABN , First Publish Date - 2020-09-13T00:05:50+05:30 IST

ఏపీలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. గత ప్రభుత్వం ఐటీ రంగం కోసం కొంతమేర కంపెనీలకు...

ఏపీలో ఐటీ రూటు ఎటు?

ఏపీలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధిత అసోసియేషన్ నడుంబిగించిందా?. ప్రభుత్వాలతో  సంబంధంలేకుండా ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉందా?. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ప్రభుత్వం పట్టించుకోకపోయినా సొంతంగా  ముందుకు సాగాలని ఐటీ అసోసియేషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఏపీలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. గత ప్రభుత్వం ఐటీ రంగం కోసం కొంతమేర కంపెనీలకు తీసుకొచ్చినా పెద్దగా వృద్ధి లేదు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక  ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. గత ప్రభుత్వ హయాంలోని బకాయిలు, వైసీపీ వచ్చిన తర్వాత రాయితీలు ఇప్పటికీ చెల్లించలేదు. ఇక ఐటీకోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికే ఐటీ అసోసియేషన్ అభిప్రాయాలను తీసుకుని కొత్త పాలసీని డ్రాప్ చేసే ఆలోచనలో ఉంది. ప్రభుత్వాలు సాయం చేస్తాయని ఎదురు చూస్తూ కూర్చోవడంకంటే తమ వంతుగా ఐటీ పరిశ్రమ అభివృద్ధికి  నడుంకట్టాలని నిర్ణయించుకుంది. 

Updated Date - 2020-09-13T00:05:50+05:30 IST