AP: తెనాలి ప్రభుత్వాస్పత్రిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-01-11T14:09:14+05:30 IST

జిల్లాలోని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

AP: తెనాలి ప్రభుత్వాస్పత్రిలో తప్పిన ప్రమాదం

గుంటూరు: జిల్లాలోని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలోని స్టోర్ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో స్టోర్ రూమ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2022-01-11T14:09:14+05:30 IST