ఏపీ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వుల్లో కొత్త మెలిక

ABN , First Publish Date - 2022-01-19T02:33:10+05:30 IST

ద్యోగుల హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వుల్లో ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. పోలీస్‌శాఖలో ఇన్‌స్పెక్టర్, తక్కువ ర్యాంకుల్లోని ఉద్యోగులకు తగ్గించిన హెచ్‌ఆర్‌ఏ వర్తించదని..

ఏపీ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వుల్లో కొత్త మెలిక

అమరావతి: ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వుల్లో ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. పోలీస్‌శాఖలో ఇన్‌స్పెక్టర్, తక్కువ ర్యాంకుల్లోని ఉద్యోగులకు తగ్గించిన హెచ్‌ఆర్‌ఏ వర్తించదని జీవోలో పేర్కొంది. వీరి కోసం హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. 


డీఏ, హెచ్ఆర్ఏ, పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హెచ్ఆర్ఏ తగ్గించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీస్ శాఖలోని ఇన్‌స్పెక్టర్, తక్కువ ర్యాంకుల్లోని ఉద్యోగులకు మాత్రం తగ్గించిన హెచ్‌ఆర్‌ఏ వర్తించదని చెబుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి మిగిలిన ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 



Updated Date - 2022-01-19T02:33:10+05:30 IST