అమరావతి: పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలకు నిరసన సెగ కొనసాగుతోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అషుతోష్ మిశ్రా పీఆర్‌సీ నివేదికను యథాతథంగా అమలు చేస్తేనే ఒప్పుకోవాలన్నామని, ఫిట్‌మెంట్ తగ్గింపుపై సీఎం దగ్గర ఎందుకు ఒప్పుకున్నారని నిలదీశారు.తమకు కొత్త పీఆర్సీ అవసరం లేదని ఉద్యోగులు అంటున్నారు. 10వ పీఆర్‌సీని 27 శాతం ఐఆర్‌తో 5 డీఏలు ఇచ్చి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎంఓ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పెద్దలను ఒప్పించాలని వెంకట్రామిరెడ్డి ముందు ప్రతిపాదనలు పెట్టారు. 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసుకు అంగీకరించేది లేదని, అలా జరిగితే ప్రమోషన్‌లు మరో 15 ఏళ్లు వెనక్కిపోతాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.