థియేటర్ల విషయంలో జగన్‌కు నిర్మాతలు భయపడుతున్నారా?

ABN , First Publish Date - 2021-12-25T01:10:18+05:30 IST

ఏపీ సినిమా టికెట్ల ధరల మంటలు కొనసాగుతున్నాయి. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరల ప్రకారమే ..

థియేటర్ల విషయంలో జగన్‌కు నిర్మాతలు భయపడుతున్నారా?

అమరావతి: ఏపీ సినిమా టికెట్ల ధరల మంటలు కొనసాగుతున్నాయి. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరల ప్రకారమే థియేటర్లలో టికెట్లు విక్రయించాలని జీవో జారీ చేసింది. దీంతో సినిమా థియేటర్ల యజమానులు, సినీ నిర్మాతలు, హీరోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తగ్గించిన ధరలకు టికెట్లు అమ్మితే సినిమా, థియేటర్ల నిర్వహణ ఖర్చులు కూడా రావని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం టికెట్ ధరలపై పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం ససేమీరా అంటోంది. సినిమా థియేటర్లపై దాడులు నిర్వహిస్తోంది. సీజ్ చేస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం.. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. పెద్ద సినిమాల బెన్‌ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. 


ఈ నేపథ్యంలో ‘‘థియేటర్ల విషయంలో జగన్‌కు నిర్మాతలు భయపడుతున్నారా?. ఏపీలో ఆరని సినిమా టికెట్ల ధరల మంటలు. సినిమా టికెట్ల ధరలు పెంచిన తెలంగాణ. ఏపీ తెలంగాణ నిర్ణయాల మధ్య తేడా ఏంటి?. ఏపీ నిర్ణయాన్ని సమర్థించే శక్తులు తెలంగాణ నిర్ణయాన్ని వ్యతిరేకించగలవా?. సినీ రంగాన్ని కాపాడుకోవాల్సిన హీరోలు ఎందుకు మొహం చాటేస్తున్నారు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2021-12-25T01:10:18+05:30 IST