Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

అమరావతి: బుధవారం జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. గురువారం ఉదయం జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ముందు కేబినెట్ మీట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.  మొత్తం 14 బిల్లులను కేబినెట్ ముందుకు ప్రభుత్వం తీసుకురానుంది. ఇప్పటికే ఈ బిల్లులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసింది. 


ఇదిలా ఉంటే డిసెంబర్‌లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. కీలక ఆర్డినెన్సులు అసెంబ్లీ ఆమోదానికి రానున్నాయి. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఒకే రోజున 14 ఆర్డినెన్సులు అసెంబ్లీ, మండలి ముందుకు రానున్నాయి.  ఏపీ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ చట్ట సవరణ, ఏపీ రైట్స్‌ ఇన్ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ, ప్రైవేట్‌ వర్సిటీల చట్ట సవరణ, ఏపీ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులెటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చట్ట సవరణలు ఆమోదానికి రానున్నాయి. ఏపీ విద్యాశాఖ చట్ట సవరణ ఏపీ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌,ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ చట్ట సవరణ, చట్ట రెండో సవరణ ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌, ఫారిన్‌ లిక్కర్‌ చట్ట సవరణ ఆర్డినెన్సులు ఆమోదానికి రానున్నాయి. ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌ చట్ట సవరణ, ఏపీ బొవైన్‌ బ్రీడింగ్‌ చట్ట సవరణ, సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్స్‌ కో-కంట్రిబ్యూటరీ పెన్షన్‌ చట్ట సవరణ, ఏపీ మున్సిపల్‌ కార్పొరేషన్ల చట్ట సవరణ, సినిమా నియంత్రణ చట్ట సవరణ ఆర్డినెన్సులు కూడా ఆమోదానికి రానున్నాయి.Advertisement
Advertisement