ఏపీలో కుప్పల్లా పేరుకుపోతున్న కాంట్రాక్టర్ల బిల్లులు..

ABN , First Publish Date - 2021-06-23T16:41:42+05:30 IST

విజయవాడ: ఏపీలో కాంట్రాక్టర్ల బిల్లులు కుప్పల్లా పెరుకుపోతున్నాయి.

ఏపీలో కుప్పల్లా పేరుకుపోతున్న కాంట్రాక్టర్ల బిల్లులు..

విజయవాడ: ఏపీలో కాంట్రాక్టర్ల బిల్లులు కుప్పల్లా పేరుకుపోతున్నాయి. అమోదం పొందిన పెండింగ్ బిల్లులే రూ. 35వేల కోట్లు ఉండగా.. అనుమతి కోసం ఎదురుచూస్తున్నవి మరో రూ. 65వేల కోట్లు. కాంట్రాక్టర్లు రెండేళ్ల నుంచి తిరుగుతున్నా రాష్ట్ర ఖజానా నుంచి చిల్లి గవ్వ కూడా విడుదల కావడంలేదు. దీంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. 


ఏపీలో వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగిపోతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి బిల్లులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు, వివిధ పనులు చేసినవారు. గగ్గోలు పెడుతున్నారు. ఈ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులు చుట్టూ తిరిగినా ఫలితంలేకుండాపోతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2021-06-23T16:41:42+05:30 IST