అప్పుల ఆంధ్రప్రదేశ్‌ ఘనత వైసీపీదే

ABN , First Publish Date - 2022-08-08T05:39:38+05:30 IST

రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘ నత వైసీపీ ప్రభుత్వానిదేనని బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సువ్వారు రాజేష్‌ కుమార్‌ అన్నారు.

అప్పుల ఆంధ్రప్రదేశ్‌ ఘనత వైసీపీదే
బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఎన్‌ఈఆర్‌

  బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్‌కుమార్‌ 

ఎచ్చెర్ల, ఆగస్టు 7: రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘ నత వైసీపీ ప్రభుత్వానిదేనని బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సువ్వారు రాజేష్‌ కుమార్‌ అన్నారు. ఓ యువతా రా.. తరలిరా పేరిట ఆ దివారం చిలకపాలెంలో నిర్వహించి న బీజేపీ యువ సంఘర్షణ యాత్ర లో ఆయన మాట్లాడారు. మద్యాన్ని నిషేధిస్తామని ప్రకటించిన సీఎం జగన్‌.. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే సీఎం తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమవుతున్నారని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగావకాశాలు కల్పించలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా లేకుండా పోయింద న్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీ, రాష్ట్ర కోశాధికారి దిలీప్‌నాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ  సీనియర్‌ నేత సువ్వారు వెంకటసన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు. 


 బీజేపీ నేతల బైక్‌ ర్యాలీ..  

రణస్థలం, ఆగస్టు 7: యువ సంఘర్షణ యాత్రలో భాగంగా ఆదివారం బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, ఎచ్చెర్ల నియోజకవర్గ    ఇన్‌చార్జి నడుకుదిటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. లావేరు మండల వెంకటాపురం నుంచి రణస్థలం మీదుగా విజయనగరం వరకు ఈ బైక్‌ ర్యాలీ సాగింది.  పేదల అభ్యున్నతికి ప్రధాన మంత్రి మోదీ అనేక  పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-08T05:39:38+05:30 IST