Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Gadde Tirupatirao: సీఎం జగన్ మాట తప్పి.. మడమ తిప్పి.. మోసం చేశారు..

twitter-iconwatsapp-iconfb-icon
Gadde Tirupatirao: సీఎం జగన్ మాట తప్పి.. మడమ తిప్పి.. మోసం చేశారు..

విజయవాడ (Vijayawada): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మాట తప్పి, మడమ తిప్పి మోసం చేశారని అమరావతి జేఏసీ నాయకుడు గద్దె తిరుపతిరావు (Gadde Tirupatirao) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 30 వేల ఎకరాలు కావాలన్నారని, ఇల్లు కూడా ఇక్కడే కట్టానని చెప్పారన్నారు. ఇప్పుడు అందరినీ మోసం చేసి రోడ్టు మీదకు లాగారని ఆరోపించారు. ఇంత మంది రైతులు పాదయాత్ర చేస్తున్నా.. పాలకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఆడవాళ్లని అన్యాయంగా బూతులు తిట్టిస్తున్నారని, కోర్టు చెప్పినా.. సీఎం జగన్ మూర్ఖంగా ముందుకు వెళుతున్నారని విమర్శించారు. అమరావతి అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు అవసరం అనేది పచ్చి అబద్ధమన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం హోదాలో అవాస్తవాలు ప్రకటించడం సిగ్గుచేటని గద్దె తిరుపతిరావు వ్యాఖ్యానించారు.


శివారెడ్డి మాట్లాడుతూ అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారన్నారు. ప్రతి జిల్లాలో రైతులు, మహిళలు, ఘన స్వాగతం పలుకుతున్నారని, మంత్రులు నోళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఆడవాళ్లను అన్యాయంగా ఆడిపోసుకుంటే ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు. అమరావతే ఏకైక రాజధాని.. అదే న్యాయం, ధర్మమని అన్నారు. ఇతర ప్రాంతాలను అభివృద్ధి  చేయాలని తాము కూడా కోరుతున్నామని అన్నారు.


రాయపాటి శైలజ మాట్లాడుతూ అమరావతి రైతుల ఉద్యమంలో న్యాయం ఉందన్నారు. అందుకే అన్ని చోట్లా ప్రజలు మద్దతు ఇస్తున్నారని, హైకోర్టు కూడా అమరావతే రాజధాని అని తీర్పు ఇచ్చిందన్నారు. ఆరు నెలల తర్వాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని విమర్శించారు. సీఎం జగన్‌కు రాజకీయ స్వలాభం తప్ప.. రాష్ట్ర ప్రయోజనం పట్టదన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ పేరు కూడా రాజకీయ వివాదం కోసమేనని, అమరావతి ఉద్యమ ప్రచారాన్ని పక్కదారి పట్టించడానికేనని ఆరోపించారు. అమరావతి ఉద్యమం అంటే.. మహిళా రైతుల ఉద్యమం అని అన్నారు. ముఖ్యమంత్రికి మహిళలంటే భయం పట్టుకుందని, అందుకే అనరాని మాటలు అనిపిస్తున్నారన్నారు. సీఎం జగన్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని రాయపాటి శైలజ అన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.