Advertisement
Advertisement
Abn logo
Advertisement

సాగర్ ప్రాజెక్టులోని కుడిగట్టు విద్యుత్ కేంద్రాలను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఏపీ ఉత్తర్వులు

అమరావతి: శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని కుడిగట్టు విద్యుత్ కేంద్రాలను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఈ మేరకు జీవో జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన పరిధిలోని పవర్ హౌస్‌లను అప్పగిస్తేనే ఏపీ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. పవర్ హౌస్‌లలోని సిబ్బంది కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి వస్తారని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇంధన శాఖ నుంచి జీవో నెంబర్ 17ను ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement
Advertisement