YSRCP గౌరవ అధ్యక్షురాలు Vijayalakshmiని సాగనంపేందుకు Jagan ఎత్తుగడ

ABN , First Publish Date - 2022-07-07T20:20:10+05:30 IST

వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మిని సాగనంపేందుకు సీఎం జగన్ ఎత్తుగడ వేశారు.

YSRCP గౌరవ అధ్యక్షురాలు Vijayalakshmiని సాగనంపేందుకు Jagan ఎత్తుగడ

అమరావతి (Amaravathi): వైఎస్సార్‌సీపీ (YSRCP) గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి (Vijayalakshmi)ని సాగనంపేందుకు సీఎం జగన్ (CM Jagan) ఎత్తుగడ వేశారు. ఆమెతోనే స్వయంగా రాజీనామా చేయించే విధంగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు జరగనున్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. వైఎస్ జయంతోత్సవాల సందర్భంగా సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్లి అక్కడ నుంచి నేరుగా వచ్చి ప్లీనరీ సమావేశాలు ప్రారంభిస్తారు.


పార్టీ బైలాని, నియమావళిని ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి మార్పు చేస్తున్నట్లు సజ్జల ప్రకటించారు. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని సమాచారం. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకొకసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయలక్ష్మి ఉన్నారు. ఆమె తెలంగాణలో వైఎస్సార్‌టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉండడంతో రెండు రాష్ట్రాల్లో ఉండడం కుదరదనే ఉద్దేశంతో ఆమెను తప్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయలక్ష్మిని తొలగించాలంటే పార్టీ రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. దీనిపై న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. గురువారం సాయంత్రానికి ఒక రూపం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.


కాగా తెలివిగా వైసీసీ గౌరవ అధ్యక్షురాలి స్థానం నుంచి విజయలక్ష్మిని తప్పించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి షర్మిల పార్టీని సాకుగా చూపుతున్నారు. విజయలక్ష్మే స్వయంగా రాజీనామా చేసేలా ముఖ్యమంత్రి ఎత్తుగడ వేస్తున్నారు. కాగా చెల్లి, తల్లిని పార్టీ నుంచి జగన్ తప్పించారంటూ విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2022-07-07T20:20:10+05:30 IST