AP: భూములు, ఆస్తులు అమ్మకపోతే Jagan ప్రభుత్వాన్ని నడపలేరా?

ABN , First Publish Date - 2022-06-27T17:05:01+05:30 IST

రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన భూములను అమ్మాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

AP: భూములు, ఆస్తులు అమ్మకపోతే Jagan ప్రభుత్వాన్ని నడపలేరా?

అమరావతి (Amaravathi): ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన భూములను అమ్మాలని జగన్ (Jagan) ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో ఏముంది.. అంతా గ్రాఫిక్సే (Graphics) అంటూ జగన్ విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శ్మశానమని (Cemetery), ముంపు ప్రాంతమంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ భూములను అమ్మడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. టీడీపీ (TDP) హయాంలో చంద్రబాబు (Chandrababu) అమరావతిలో గ్రూప్ D ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల కోసం ఆరు టవర్లు నిర్మించారు. వాటిని లీజుకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దాదాపు రూ. 2,400 కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి 389 జీవోను విడుదల చేసింది. మరోవైపు ఏపీ రాజధాని అమరావతిని ఆరు నెలలలోపు అభివృద్ధి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డబ్బుల సమీకరణకు రంగం సిద్ధం చేసింది. ఆ నిధులను రాజధాని అభిృద్ధికి వినియోగిస్తారా? అన్న దానిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అస్తులు అమ్మితేగాని ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదా? ఇది అభివృద్ధికి సంకేతమా?.. లేక తిరుగమనానికి సంకేతమా?.. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. దీనిపై పలువురు నేతల అభిప్రాయాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. 

Updated Date - 2022-06-27T17:05:01+05:30 IST