AP: వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమంలో పోస్టుల భర్తీకి అడ్డగోలు విధానం

ABN , First Publish Date - 2022-06-25T18:04:18+05:30 IST

ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమంలో పలు పోస్టుల భర్తీకి అధికారులు అడ్డగోలు విధానం

AP: వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమంలో పోస్టుల భర్తీకి అడ్డగోలు విధానం

అమరావతి (Amaravathi): ఏపీ (AP) వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమంలో పలు పోస్టుల భర్తీకి అధికారులు అడ్డగోలు విధానం పాటిస్తున్నారు. రోస్టర్ పాయింట్లు పాటించకుండానే పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఇచ్చిన జీవో నెంబర్ 472 విడుదల అక్రమమని ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు అంటున్నారు. 2,195 పోస్టుల భర్తీకి ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో 1952 పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందివిగా గుర్తించారు. వాటిని టీచింగ్ కాలేజీలు, హాస్పిటల్స్‌లో భర్తీ చేయాలని నిర్ణయించారు. పారామెడికల్ సిబ్బందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియమించాలని, రుల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అభ్యర్ధులు లేకపోవడంతో రోస్టర్ పాయింట్లను పక్కన పెట్టి ఓపెన్ కంపిటేషన్‌లో భర్తీ చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవి చంద్ర ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - 2022-06-25T18:04:18+05:30 IST