APలో పొత్తులపై Pawan చేసిన వ్యాఖ్యలు కలకలం

ABN , First Publish Date - 2022-06-06T18:40:40+05:30 IST

APలో ఎన్నికల పొత్తులపై చర్చ ప్రారంభమైంది. పార్టీ సర్వసభ్య సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు...

APలో పొత్తులపై Pawan చేసిన వ్యాఖ్యలు కలకలం

Vijayawada: APలో ఎన్నికల పొత్తులపై చర్చ ప్రారంభమైంది. పార్టీ సర్వసభ్య సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. పవన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించగా.. టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఇక వైసీపీ మాత్రం ఎంతమంది కలిసి వచ్చినా తమకు అభ్యంతరం లేదని చెబుతోంది...


పవన్ కల్యాణ్ ఆప్షన్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయంగా కలకలం రేపాయి. పొత్తుల అంశంలో తమ పార్టీ ఎదుట మూడు ఆప్షన్లు ఉన్నాయని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అందులో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం మొదటి ఆప్షన్ కాగా.., బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం రెండో ఆప్షన్.., మూడో ఆప్షన్‌గా జనసేన ఒంటరిగా పోటీ చేయడమని పవన్ వ్యాఖ్యానించారు. పొత్తులపై తాను తగ్గబోనని 2014, 2019 ఎన్నికల్లో రెండడుగులు వెనక్కి వేశామని, ఈసారి మాత్రం తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. అవతలివాళ్లు తగ్గాలంటూ పరోక్షంగా టీడీపీకి సంకేతాలు పంపారు. 


పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేతలు తాము మొదటి ఆప్షన్‌కే  కట్టుబడి ఉన్నామని చెప్పారు. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని సోము వీర్రాజు ప్రకటించారు. ఎవరు మెట్టు దిగుతారో, ఎవరు పైకి వెళతారో త్వరలోనే తెలుస్తుందన్నారు. బీజేపీ, జనసేన కూటమి ఎవరికోసమో త్యాగం చేయబోదని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.

Updated Date - 2022-06-06T18:40:40+05:30 IST